జగిత్యాలక్రైం: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు జగిత్యాల జిల్లా పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇబ్బందులు తలెత్తితే సంరక్షణకు మూడు ప్రత్యేక రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. లోతట్టు ప్రాంతాలు, రహదారుల వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. బృందాలకు లైఫ్ జాకెట్లు, తాళ్లు, రెస్క్యూ కిట్లు, ఇతర ప్రత్యేక భద్రత పరికరాలు అందుబాటులో ఉంచామన్నారు.


