రాయికల్: రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి భేషజాలానికి పోతున్నాడని విమర్శించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి దయతో కురిసిన వర్షానికి రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారని, ఈ క్రమంలో యూరియా, డీఏపీ వంటి మందుల కొరత లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం స్పందించి 24 కరెంట్ అందించాలన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, నాయకులు తాటిపర్తి చంద్రకృష్ణారెడ్డి, బర్కం మల్లేశ్, గోపి రాజిరెడ్డి, కొయ్యడి మహిపాల్‌రెడ్డి, హరీశ్‌రావు, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.


