జగిత్యాలరూరల్: వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ఊరటనిచ్చింది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతారం శివారు జాతీయ రహదారి మీదుగా వాగు ఉధృతిగా ప్రవహించింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై రాకపోకలు నిలిపివేయించారు. రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్, ఎంపీవో రవిబాబు అనంతారం రోడ్డ్యాం వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. పెర్కపల్లి–హన్మాజీపేట గ్రామాల మధ్య ఉన్న బొల్లెవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పొరండ్ల, రంగపేట వైపు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు ఉంచారు.


