ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

● కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ ● పైడిమడుగులో ‘జలసిరి’కి భూమిపూజ

కోరుట్ల రూరల్‌: ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులను ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు వెళ్లాలని కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సమీక్షసమావేశం నిర్వహించారు. రైతులకు పంటల వైవిధ్యంపై అవగాహన కల్పించాలని, చిరుధాన్యాలు, ఆరుతడి పంటలు సాగు చేసేలా చూడాలని సూచించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పైడిమడుగు గ్రామంలో వీవీజీ రాంజీ పథకం కింద జలసిరిలో భాగంగా ఫాం పాండ్లు, ఇంకుడుగుంతలు, బోర్‌ రిచార్జీ పనులకు భూమిపూజ చేశారు. జోగిన్‌పల్లిలో వీవో భవనాలు, అంగన్‌వాడీ భవన పనులను పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్‌డీవో రఘువరన్‌, ఆర్డీవో జీవాకర్‌ రెడ్డి, తహసీల్దార్‌ కృష్ణ చైతన్య, ఎంపీడీవో, సర్పంచులు భూమేశ్వర్‌, బద్దం తిరుపతి రెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాస్‌ యాదవ్‌, సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement