జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
జగిత్యాలరూరల్: ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె, ధర్మనాయక్ తండాలో వందశాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా బీఎల్వోలు స్వప్న, శ్యామల, ఆదిలక్ష్మీని సన్మానించారు. బీఎల్వోలు అంగన్‌వాడీ బాధ్యతలు, ఎస్‌ఐఆర్ ప్రక్రియను బాధ్యతతో పూర్తి చేయడం అభినందనీయమన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, ప్యాక్స్ మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, నాయకులు సాంబారి గంగాధర్, ఉపేందర్, వోడ్నాల జగన్, మహిపాల్, జలందర్, ఆనంద్‌రెడ్డి, శ్రీనివాస్, రాజేశ్వర్‌రెడ్డి, సుమన్ పాల్గొన్నారు.


