జగిత్యాల:నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ నిర్వహించారు. ఇందులో జగిత్యాల బల్దియా కార్యవర్గం పాల్గొంది. మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, స్థానిక సంస్థల పరిపాలన, ప్రభుత్వ పథకాల అమలు, మున్సిపల్ సేవల పెరుగుదల, పట్టణ ప్రణాళిక, ఆర్థిక నిర్వహణ అంశాలపై కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. చైర్‌పర్సన్ సమిండ్ల వాణి మాట్లాడుతూ శిక్షణ ద్వారా ప్రజాప్రతినిధుల సామర్థ్యాలు మెరుగుపడి ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు తోడ్పడుతుందన్నారు.


