ఫొరెన్సిక్‌ సైంటిస్ట్‌గా హరీశ్‌ | - | Sakshi
Sakshi News home page

ఫొరెన్సిక్‌ సైంటిస్ట్‌గా హరీశ్‌

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

గొల్లపల్లి: సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. పట్టుదలతో చదివి తెలంగాణ ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీలో శాసీ్త్రయ అధికారి (సైంటిఫిక్‌ ఆఫీసర్‌)గా మండలకేంద్రానికి చెందిన చెవులమద్ది హరీశ్‌. ఈ మేరకు డీజీపీ చేతులమీదుగా హైదరాబాద్‌లో నియామకపత్రం అందుకున్నారు. మండలకేంద్రానికి చెందిన చెవులమద్ది రామవ్వ, నర్సయ్య దంపతుల కుమారుడు హరీశ్‌ జేఎన్టీయూ (హైదరాబాద్‌) నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఇటీవల తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన నియామక ప్రక్రియలో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదన్నారు. తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కతజ్ఞతలు తెలిపారు. హరీశ్‌ను కుటుంబ సభ్యులు, గొల్లపల్లి గ్రామస్తులు అభినందిస్తున్నారు.

రానున్న ఐదు రోజులు మోస్తరు వర్షాలు

జగిత్యాలఅగ్రికల్చర్‌: రానున్న ఐదురోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోదన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మీ తెలిపారు. 29, 30తేదీల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, 31 నుంచి ఆగస్టు రెండు వరకు బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

ఘనంగా కుజదోష నివారణ పూజలు

ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగనంలోని యాగశాలలో మంగళవారం కుజదోష నివారణ పూజలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ కలహాలు, వాస్తుదోశాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు శారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

హైపటైటిస్‌పై అప్రమత్తంగా ఉండాలి

జగిత్యాల: హైపటైటిస్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ అన్నారు. మెడికల్‌ కళాశాల వద్ద మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైపటైటిస్‌తో కాలేయంలో వాపులు, కామెర్లు, కాలేయ పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని, జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం ఉండదన్నారు. కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ సుభాష్‌, డాక్టర్లు శ్రీనివాస్‌, రాజేందర్‌, నరేందర్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

దిగుబడినిచ్చే పంటలు సాగు చేయాలి

ధర్మపురి: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటి వినియోగం అయ్యే పంటలు సాగు చేయాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి కట్ట లత సూచించారు. ధర్మపురిలోని రైతు వేదిక కార్యాలయంలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల రైతులకు ఆయిల్‌ పాం, పండ్లు, కూరగాయల సాగుపై అవగాహన కల్పించారు. మల్బరీ, ఉల్లి, కూరగాయలు, పండ్లు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ హెచ్‌ఈవో వంశీకృష్ణ, అర్చన, రాజ్‌కుమార్‌, రైతులు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement