జగిత్యాల: జిల్లా కేంద్రంలో మెడికల్, నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కోర్సులు తేవాలని ఎమ్మెల్యే సంజయ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్‌లో కోరా రు. జిల్లాకేంద్ర ఆస్పత్రిలో మందులు స్టాక్ ఉంచాలని, రేడియాలజీ విభాగాన్ని ఆస్పత్రి పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రూ.235 కోట్లతో నిర్మిస్తున్న 450 పడకల ఆస్పత్రి, వైద్య కళాశాల హాస్టల్ త్వరగా పూర్తి చేయాలని కోరారు. పాతబస్టాండ్ వద్దగల ఆస్పత్రిలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు రూ.2 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ట్రామా సెంటర్ ఏర్పాటుకు సహకరించాలన్నారు.
ఆస్పత్రులను బలోపేతం చేయాలి
కోరుట్ల: కోరుట్ల, మెట్‌పల్లి ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహను కోరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన వైద్య ఆరోగ్య సమీక్ష సమావేశంలో పాల్గొని నియోజకవర్గంలోని ఆస్పత్రుల సమస్యలను మంత్రికి వివరించారు. రెండు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులను బదిలీ చేయొద్దని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని వినతిపత్రం సమర్పించారు. స్పెషలిస్ట్, స్టాఫ్‌నర్స్, పారామెడికల్, సాంకేతిక పరిపాలని సిబ్బందిని నియమించాలని కోరారు. కోరుట్ల ఆస్పత్రికి కొత్త భవనం ఉన్నా.. సరైన పరికరాలు, సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.


