గంజాయి విక్రేతల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేతల అరెస్ట్‌

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

● 120 గ్రాముల గంజాయి స్వాధీనం

జగిత్యాలక్రైం: జగిత్యాల శివారు మోతె శ్మశానవాటిక ఎదురుగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్‌ తెలిపారు. మంగళవారం నిందితులను అరెస్ట్‌ చూపారు. పట్టణ శివారు లింగంపేటకు చెందిన జవ్వాజి తేజ, హౌసింగ్‌బోర్డుకు చెందిన గజ్జెల అజయ్‌, లక్ష్మీపూర్‌కు చెందిన ఆలకుంట్ల గణేశ్‌, తులసీనగర్‌కు చెందిన ఏళ్ల మనోజ్‌ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లి 120 గ్రాముల గంజాయి కొనుక్కుని వచ్చి మోతె శ్మశాన వాటిక వద్ద విక్రయిస్తున్నారు. వారిని పట్టణ ఎస్సై సుప్రియ పట్టుకుని 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై కుమారస్వామి పాల్గొన్నారు.

ఒకరి అదృశ్యం

కరీంనగర్‌క్రైం: నగరంలోని సు భాష్‌నగర్‌కు చెందిన రామగిరి శ్రీకాంత్‌ (37) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు త్రీ టౌన్‌ పో లీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మానసిక సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతను ఈ నెల 23 నుంచి కనిపించడం లేదు. శ్రీకాంత్‌ ఎత్తు 5.4 అడుగులు, తెలుపు వర్ణం, గుండ్రని ముఖం కలిగి ఉండగా, తలకు శస్త్రచికిత్స చేసిన మచ్చ ఉందని తెలి పారు. ఆచూకీ తెలిసిన వారు కరీంనగర్‌–3 టౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement