టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత వాహనానికి వరుస చలాన్లు | - | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత వాహనానికి వరుస చలాన్లు

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

తంగళ్లపల్లి(సిరిసిల్ల) : టీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న టీఎస్‌09ఈయూ6666 నంబర్‌ గల కారుపై భారీ స్థాయిలో ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌లో ఉన్న విషయం శ్రీసాక్షిశ్రీ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ఈ వాహనంపై 25 చలాన్లు నమోదై ఉండగా, మొత్తం రూ.21,875 చెల్లించాల్సి ఉంది.

జిల్లాలు దాటినా ఆగని ఉల్లంఘనలు

తెలంగాణ పబ్లికేషన్స్‌ పేరిట రిజిస్టరైన ఈ కారు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రయాణించిన సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈ చలాన్‌ డేటా స్పష్టం చేస్తోంది. ఓవర్‌ స్పీడింగ్‌: ఎంవీ యాక్ట్‌ సెక్షన్‌ 184 ప్రకారం.. నిర్ణీత వేగ పరిమితి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినందుకు నిజామాబాద్‌ (ఇందల్వాయి), కరీంనగర్‌ (నుస్తులాపూర్‌), సిద్దిపేట, కామారెడ్డి (అడ్లూర్‌), మెదక్‌ (చేగుంట), రామగుండం, హైదరాబాద్‌ (పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే) వంటి ప్రధాన రహదారులపై అత్యధికంగా రూ.1,000 చొప్పున ఫైన్లు విధించారు.

ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్లు: మోటార్‌ వాహనాల నిబంధనలకు విరుద్ధంగా నంబర్‌ ప్లేట్‌ కలిగి ఉన్నందుకు హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పలుమార్లు రూ.200 చొప్పున చలాన్లు వేశారు.

అక్రమ పార్కింగ్‌: రహదారిపై వాహనాల రాకపోకలకు అడ్డంకిగా వాహనాన్ని నిలిపినందుకు సైబరాబాద్‌ (నార్సింగి) పరిధిలోనూ జరిమానా పడింది. సాధారణ వాహనదారులపై నిబంధనల పేరుతో కఠినంగా వ్యవహరించే పోలీసులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల వాహనాల విషయంలోనూ అదే రీతిలో చలాన్లను వసూలు చేస్తే బాగుంటుందని సామాన్యులు కోరుతున్నారు.

పెండింగ్‌ ఫైన్‌ రూ.21,875

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement