అక్కాచెల్లెళ్ల అద్భుత ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

అక్కాచెల్లెళ్ల అద్భుత ప్రతిభ

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

రాయికల్‌: మండలంలోని మైతాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అక్కాచెల్లెళ్లు కడ దీక్షిత, హర్షిణి మూలకాలు చెప్పి రికార్డు సృష్టించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న దీక్షిత నిత్యం సాధన చేసి చూడకుండా.. తక్కువ సమయంలో మూలకాల పేర్లు రికార్డ్‌ నెలకొల్పింది. ఆమె పీరియడిక్‌ టేబుల్లోని 118 మూలకాలను 25 సెకన్లలో చెప్పి ఇతరుల పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. దీక్షత ప్రతిభను గుర్తించిన ఇంటర్నెషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సంస్థలు ‘ఫాస్టేస్ట్‌ చైల్డ్‌ టు రియాక్టివ్‌ ఆల్‌ ది ఎలిమెంట్స్‌ ఆఫ్‌ పీరియాడికి టేబుల్‌ పేరిట రికార్డ్‌ నమోదు చేసి ప్రశంసపత్రాలు, మెడల్స్‌ అందించారు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హర్షిణి 42 సెకన్లలో పీరియడిక్‌ టేబుల్‌ను చూడకుండా చదివి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. రికార్డ్స్‌ నెలకొల్పిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను కలెక్టర్‌ సత్య ప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ రాజగౌడ్‌, డీఈవో రాము అభినందించారు. హెచ్‌ఎం మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రికార్డులు సాధించామని దీక్షిత, హర్షిణి తెలిపారు.

మైతాపూర్‌ జిల్లా పరిషత్‌ విద్యార్థినుల ఘనత

అభినందించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement