యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. డీఏపీ ధర రూ. 1350ఉంటే డీలర్లు రూ.1950కి విక్రయిస్తున్నారు. ఎల్‌నినోతో రైతులు ఇబ్బంది పడుతుంటే కొందరు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
– జెడ్పీ, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్లు
దావ వసంత, భోగ శ్రావణి
అర్హులకు న్యాయం చేయండి
మెట్లచిట్టాపూర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో టీజీటీ, పీజీటీ అతిధి పోస్టుల నియామకాలను రద్దు చేసి, అవకతవకలకు పాల్పడిన ఆర్‌సివో, డీసీవోలపై చర్యలు తీసుకోండి. గెస్ట్ టీచర్ పోస్టులకు జూలై 8న డెమో నిర్వహిస్తామని ప్రకటించిన అధికారులు చిట్టాపూర్ గురుకులంలోని టీజీటీ మ్యాథ్స్, పీజీటీ మ్యాథ్స్ పోస్టులకు ఎలాంటి ప్రకటనా చేయకుండానే నియమించారు. వాటిని రద్దు చేసి అర్హులకు న్యాయం చేయండి.
– సుంకెట విజయ్, మెట్‌పల్లి


