మల్లాపూర్ మండలంలోని సాతారం ఉన్నత, రేగుంట జెడ్పీ, ప్రాథమిక పాఠశాలలు, పల్లె దవాఖానా పనులు పూర్తి చేశాం. బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న.
– రంగు రామాగౌడ్, కాంట్రాక్టర్. రేగుంట
రెవెన్యూ భూములు కాపాడండి
మా గ్రామం పక్కనే ఉన్న నడికుడను ముంపు గ్రామంగా గుర్తించారు. గ్రామస్తులకు 1976 డి1 పట్టాలు, నక్షాల ప్రకారం భూమి కేటాయించారు. రీసర్వే సందర్భంగా నడికుడ గ్రామస్తులు తప్పుడు డి1 పట్టాలు, తప్పుడు నక్షా ప్రకారం సర్వే చేయాలని అధికారులను బలవంతం చేస్తున్నారు. నడికుడ, రాఘవపేట మధ్య ఉన్న రెవెన్యూ భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
– రాఘవపేట గ్రామస్తులు, మల్లాపూర్ మండలం


