మోటార్లకు మరమ్మతు చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

మోటార్లకు మరమ్మతు చేపట్టండి

Jul 28 2026 12:49 AM | Updated on Jul 28 2026 12:49 AM

జగిత్యాలరూరల్‌: బీర్‌పూర్‌ మండలం కొల్వాయిలో ని ఎత్తిపోతల మోటార్లకు మరమ్మతు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. కొల్వాయిలోని ఎత్తిపోతల పథకాన్ని సోమవారం పరిశీలించారు. మోటార్లు కాలి నీటి సరఫరా కావడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఇరిగేషన్‌ ఎస్‌ఈ, డీఈతో ఫోన్లో మాట్లాడారు. ఏడాది కాలంగా మరమ్మతు చేయక పోవడం అధికారుల నిర్లక్ష్యమన్నారు. నీరు ఉండి పంటలు పండించుకోలేని దుస్థితి రాకుండా చూడాలని కోరారు. ఈనెల 31లోగా కమ్మునూర్‌, మంగేళ పంపుసెట్ల ద్వారా నీరు అందించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement