జగిత్యాల: మహిళా సంఘాల సభ్యులు సీ్త్రనిధి రుణాలతో ఆదాయం పెంచుకోవాలని, ఆ దిశగా సీ్త్రనిధి, సెర్ప్ సిబ్బంది అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో సీ్త్రనిధి, సెర్ప్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా టార్గెట్ చేరుకోవాలని, బకాయిలు లేకుండా చూడాలని, డిజిటల్ పద్ధతి ద్వారా లావాదేవీలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. మైక్రోఫైనాన్స్ బారిన పడకుండా గ్రామీణ, పట్టణ ప్రాంత రైతులకు అండగా సీ్త్రనిధి సంస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డీఆర్‌డీవో రఘువరణ్, డీఏవో భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.
జలసంరక్షణలో భాగస్వామ్యం కావాలి
మల్యాల: జలసంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని డీపీవో మదన్ మోహన్, ఎంపీడీవో స్వాతి అన్నారు. మండలకేంద్రంలో జలసిరి కార్యక్రమంపై ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీపీవో మాట్లాడుతూ గ్రామాల్లో నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇంకుడుగుంతలు, బోర్‌వెల్ రీచార్జ్ పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో ఆమని, ఏపీవో శ్రీనివాస్, ఈజీఎస్ ఈసీ మనోజ్ పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి రఘు
మెట్‌పల్లి: తెలంగాణ రక్షణ సేన కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా డాక్టర్ చిట్నేని రఘును నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ప్రకటన విడుదల చేశారు. బీజేపీలో ఉన్న రఘు, పలువురు నాయకులు ఇటీవల కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి టీఆర్‌ఎస్ తరఫున రఘు పోటీ చేస్తారని కవిత ఇప్పటికే ప్రకటించారు. తాజా గా ఆయనను ఇన్‌చార్జిగా నియమించడంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడి భార్య ప్రసవం
కోరుట్ల: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వై ద్యుడిగా పనిచేస్తున్న ము ఖ్రం తన భార్య సోఫియా కు జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించి ఆదర్శంగా నిలిచారు. తన భార్య ప్రసవానికి సహకరించిన వైద్యులు శైలజ, తిరుమల, సాయి, మహేష్, నరేష్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో పూర్తిస్థాయి ప్రసూతి సౌకర్యాలు ఉన్నాయన్న విషయాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతోనే తాను తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించినట్లు తెలిపారు. తనకు కొడుకు జన్మించినట్లు తెలిపారు.
ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలి
ధర్మపురి: మండలంలోని ఆరెపల్లి, కొల్వాయిలో ఎత్తిపోతల పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరందించాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. సాగునీరు రావడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జైనాలో ఆయన ఏర్పాటు చేయించిన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివిధ గ్రామాల్లో మృతిచెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు అయ్యోరి రాజేశ్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులున్నారు.


