ఆర్నెళ్లలో అక్కపల్లి ఎత్తిపోతల పూర్తి | - | Sakshi
Sakshi News home page

ఆర్నెళ్లలో అక్కపల్లి ఎత్తిపోతల పూర్తి

Jul 26 2026 2:08 AM | Updated on Jul 26 2026 2:08 AM

ధర్మపురి: పెండింగ్‌లో ఉన్న అక్కపల్లి రిజర్వాయర్‌ ఎత్తిపోతల పనులను ఆర్నెళ్లలో పూర్తి చేయాలని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. అక్కపల్లితోపాటు నక్కలపేట ఎత్తిపోతల ద్వారా రైతులకు సాగునీరు అందించడానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. వెల్గటూర్‌ మండలంలోని జంగల్‌నాలా ప్రాజెక్టు పనులు, బీర్‌పూర్‌లోని రోళ్లవాగు గేట్ల పనుల పూర్తిపై హైదరాబాద్‌లో నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 15వరకు రోళ్లవాగుకు గేట్లు బిగించాలని ఆదేశించారు. గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి చెరువు పూడిక తీత పనులకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement