జగిత్యాలటౌన్: కేంద్రమంత్రి రాజీనామా వెనుక విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో శనివారం పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు నెల రోజులుగా కొనసాగిస్తున్న ఆందోళనలకు పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. టీపీసీసీ సెక్రెటరీ బండ శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, సేవాదళ్ కార్యదర్శి ముఖేష్‌ఖన్నా, ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


