మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం చింతలపేటకు చెందిన మహిళను హత్య చేసిన నిందితులకు జీవితఖైదు పడే వరకూ పోరాడుతామని స్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. చింతలపేటలో హత్యకు గురైన కర్రె సునీత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. ఇలాంటి పరువు హత్యలు సరికావన్నారు. ప్రభుత్వం నుంచి తక్షణసాయంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు, అవసరమైన పథకాలు అందేలా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. బాధితురాలి ఇద్దరు కుమారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కేసు దర్యాప్తు, పురోగతిపై పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో నరసింహారావు, డీఎస్పీ రాములు, సీఐ సురేశ్‌బాబు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రవీణ్, నీలాదేవి, రాంబాబు, శంకర్, ఎస్పీ వెల్ఫేర్ అధికారి రాజుకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్, తహసీల్దార్ నీత పాల్గొన్నారు.
ఎస్సైపై సస్పెన్షన్ ఎత్తేయాలి
కోరుట్ల: కోరుట్ల ఎస్సై చిరంజీవిపై సస్పెన్షన్ ఎత్తేయాలని కోరుట్ల దళిత సంఘాల నాయకులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యకు వినతిపత్రం సమర్పించారు. చింతలపేటకు వెళ్తున్న ఆయన పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దళిత సంఘాల నాయకులు ఉయ్యాల నర్సయ్య, బలిజ రాజిరెడ్డి, పేట బాస్కర్, చెట్‌పల్లి లక్ష్మణ్, పసుల కృష్ణ ప్రసాద్, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, రాజశేఖర్, వుయ్యల శోభన్, రాజేశం, సామల్ల వేణు, సత్యం, నారాయణ చైర్మన్‌ను శాలువాతో సన్మానించారు. కర్రె సునీతపై మొదటిసారి దాడి జరిగిన సమయంలో బాఽధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని, ఆమెను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనపై విచారణ చేపట్టకుండానే ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని పేర్కొన్నారు.


