జగిత్యాలక్రైం: గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర హెల్త్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ అన్నారు. పొరండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు విష జ్వరంతో మృతిచెందగా శుక్రవారం రాత్రి చిన్నారులు నివసించే కాలనీతో పాటు, ప్రజలకు మంచినీరు సరఫరా అయ్యే మంచినీటి బావిని పరిశీ లించారు. విషజ్వరాలతో బాధపడుతూ జగిత్యా ల ఎంసీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలుడిని పరిశీలించి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో యుద్ధ ప్రతిపాదికన శానిటేషన్ పనులు నిర్వహించాలని, వైద్య సిబ్బంది నిత్యం గ్రామంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాలతో బాధపడుతున్న వారికి వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆమె వెంట డీఎంహెచ్‌వో సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, మండల వైద్యాధికారి సౌజన్య, సర్పంచ్ నక్క హరీశ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణచైతన్య పాల్గొన్నారు.
20 మంది గుర్తింపు
పొరండ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 20 మంది చిన్నారులు విష జ్వరంతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. అందులో ఒక చిన్నారి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొ ందుతుండగా, మరో బాలుడు ఎంసీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వా రి ఆరోగ్యాలు బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
దోమకాటు ద్వారానే విష జ్వరాలు
పొరండ్లలో దోమకాటు వల్లే చిన్నారులు విషజ్వరంతో బాధపడుతున్నట్లు జగిత్యాల డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పాటు, పందులు సంచరించే ప్రాంతాల్లో దోమలు కాటు వేయడం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. ము మ్మరంగా శానిటేషన్ చేపట్టడం జరిగిందన్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
జగిత్యాల: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని కీటక జనిత వ్యాధుల నివారణ శాఖ అడిషినల్ డైరెక్టర్ పద్మజ అన్నారు. శుక్రవారం ఎంసీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇటీవల విషజ్వరాలతో మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించారు.


