జగిత్యాలజోన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు జూనియర్ సివిల్ జడ్జి, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్‌లకు సీనియర్ సివిల్ జడ్జి, సబ్ జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ హైకోర్టు రిజిష్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో జగిత్యాలలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.లావణ్య, కరీంనగర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్డి యశ్వంత్‌సింగ్, పెద్దపల్లి జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఎన్.మంజుల, గోదావరిఖని రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ కోహిర్కర్, మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాడి, ధర్మారం మండలం నందిమేడారం జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సరిత మట్టలు ఉన్నారు. వీరందరికి పదోన్నతి కల్పించినప్పటికీ ప్రస్తుతం పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. త్వరలో ఖాళీలను బట్టి ఆయా ప్రాంతాలకు పదోన్నతిపై బదిలి చేయనున్నారు.
ప్రాథమిక పాఠశాలలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో పలు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. పని ఒత్తిడితో సనుగుల పాఠశాలలో విద్యార్థి చెయ్యి విరిగిన ఘటన పూర్థి స్థాయిలో విచారణ చేయలేకపో యాను. నాకు మంగళవారం రాత్రే విషయం తెలిసింది. నర్సింగపూర్ పాఠశాల గొడవ జరిగిన రోజు లీవ్‌లో ఉన్నాను. సీఆర్పీ, కాంప్లెక్ హెచ్‌ఎం వెళ్లి సమస్యను పరిష్కరించాలని ఆదేశించాను. – వినయ్‌కుమార్, ఎంఈవో, చందుర్తి


