32.0/24.0 | - | Sakshi
Sakshi News home page

32.0/24.0

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

–8లోu

7

గరిష్టం/కనిష్టం

వాతావరణం

ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

జాబ్‌మేళాలో యువత

జగిత్యాలటౌన్‌: ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జాబ్‌మేళాకు అభ్యర్థుల నుంచి విశేష స్పందన వచ్చిందని అధికారి బింగి సత్యమ్మ తెలిపారు. 153మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 40మందిని ఎంపిక చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని సూచించారు. స్వతంత్య్ర మైక్రోఫైనాన్స్‌ కంపనీ ప్రతినిధి జి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

‘ఎస్‌ఐఆర్‌’లో ఎమ్మెల్యే సంజయ్‌

మెట్‌పల్లి: ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ గురువారం పాల్గొన్నారు. ఫారంలో పూర్తి వివరాలు నమోదు చేసి బీఎల్‌వోకు అందించారు. సర్‌ విషయంలో నిర్లక్ష్యం చూపితే ఓటరుగా పేరు తొలగిపోయే అవకాశముందన్నారు. అర్హులందరూ పూర్తి వివరాలను బీఎల్‌వోలకు అందించాలని సూచించారు.

రీయింబర్స్‌మెంట్‌కు పోరుబాట

జగిత్యాలటౌన్‌: విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్‌ ప్రమాదంలో పడిందని పేర్కొంటూ ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు గురువారం చలో కలెక్టరేట్‌ చేపట్టారు. ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు అక్రమాలిక్‌ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గాలికొదిలేసిందని, మద్యం శాఖకు మంత్రి ఉన్నా.. విద్యాశాఖకు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఒకేసారి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ప్రణయ్‌, సాయి, చందు, వరుణ్‌, కార్తీక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement