పెగడపల్లి: విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం పెగడపల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. రికార్డులు, జనరల్ డైరీ, ఆర్మ్ రూమ్, లాకప్‌గదిని పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్షించారు. బాధితుల ఫిర్యాదుపై సత్వరమే స్పందించాలని సూచించారు. యువతకు సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి వంటి మత్తుకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, మల్యాల సీఐ రాజ్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రీ సర్వేకు రైతులు సహకరించాలి
మల్లాపూర్: రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా రీ సర్వేకు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత కోరారు. మండలంలోని సిరిపూర్‌లో రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. రీ సర్వేను ఆధునిక సాంకేతికతతో పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. మెట్‌పల్లి ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్ రామచందర్, ఆర్‌ఐ అశోక్, సర్పంచ్ పెంట సౌజన్య, ఉప సర్పంచ్ సోమ నాగార్జున రెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల బాపురెడ్డి, నాయకులు పెంట శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
గీతకార్మికులకు కాటమయ్య కిట్ల పంపిణీ
జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం కోనాపూర్‌లో పెంబట్ల, కోనాపూర్, పోచంపేట, అర్పపల్లి గ్రామాలకు చెందిన గీత కార్మికులకు 105 కాటమయ్య కిట్లను ఎమ్మెల్యే సంజయ్ పంపిణీ చేశారు. కాటమయ్య కిట్లు గీత కార్మికులకు శ్రీరామ రక్ష అన్నారు. ఎల్‌నినో పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తిరుపతి, బీసీ వెల్ఫేర్ అధికారి జయరాజ్, తహసీల్దార్ వహీద్, ఎంపీడీవో నీరజ, ఎంపీవో సలీం, సర్పంచ్ కొలపాక రాధ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతులను దోపిడీ చేస్తే జైలుకే..
గొల్లపల్లి: ఎరువులు, విత్తనాల పేరిట రైతులను దోపిడీ చేస్తే జైలుకు పంపిస్తామని డీఏవో భాస్కర్ ఫర్టిలైజర్ షాపు డీలర్లను హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. స్టాక్ రిజిస్టర్లు, ఈపాస్ యంత్రాల్లోని వివరాలపై ఆరా తీశరు. దుకాణాల ఎదుట విధిగా ఎరువుల ధరల పట్టిక ప్రదర్శించాలని ఆదేశించారు. రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేసినా.. బిల్లులు ఇవ్వకుండా విక్రయించినా.. సదరు డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యూటీ డైరెక్టర్ జాన్ సుధాకర్ మాట్లాడుతూ డీలర్లు ఈపాస్ ద్వారానే విక్రయించాలన్నారు. ఏవో కరుణ, ఏఈఓలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో సుజాత సూచించారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో గురువారం పర్యటించారు. వర్షాకాలం దృష్ట్యా గ్రామీణులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, చిన్నపాటి జ్వరం రాగానే ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, మండల వైద్యాధికారి సౌజన్య, ఎంపీవో రవిబాబు, సర్పంచ్ నక్క హరీశ్, సూపర్‌వైజర్లు సత్యనారాయణ, శ్రీధర్, ఏఎన్‌ఎం విజయలక్ష్మీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


