డిజిటలైజేషన్‌ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

డిజిటలైజేషన్‌ వేగవంతం చేయాలి

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

ధర్మపురి: ఎస్‌ఐఆర్‌ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్‌ వేగవంతం చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్‌వోలు అందించిన దరఖాస్తు ఫారాలను ఆగస్టు మూడో తేదీలోగా అందించాలని ప్రజలకు సూచించారు. ఫారాలు నింపడంలో సందేహాలుంటే బీఎల్‌వో, ఎన్నికల అధికారులను సంప్రదించాలని సూచించారు.

స్కూల్‌ పనులు వేగవంతం చేయాలి

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నేరెల్ల సమీపంలో చేపడుతున్న స్కూల్‌ పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు, భవనాల రూపకల్పన, తరగతి గదులు, వసతి గృహాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, డీఈవో రాము, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఇంజినీరింగ్‌ అధికారులు, బీఎల్‌వోలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement