కేవీకి మరో ఐదెకరాలు కేటాయించాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

కేవీకి మరో ఐదెకరాలు కేటాయించాల్సిందే..

Jul 13 2026 1:22 AM | Updated on Jul 13 2026 1:22 AM

● ఎంపీ ధర్మపురి అర్వింద్‌

● ఎంపీ ధర్మపురి అర్వింద్‌

జగిత్యాలరూరల్‌: కేంద్రీయ విద్యాలయానికి మరో ఐదెకరాల స్థలం కేటాయించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. బీజేపీ పోరాటానికి తలోగ్గి చల్‌గల్‌లో కేంద్రీయ విద్యాలయానికి ఐదెకరాలు కేటాయించారని, మరో ఐదెకరాలలు కేటాయించే వరకు ఉద్యమాలు చేపడుతామని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ది చిల్లర రాజకీయమని, కొంతమంది సర్పంచులు ఆయన పార్టీ కాదని ఉపాధి నిధులు కేటాయించకుండా అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో వరెస్ట్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అని, ఆయన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల తరుఫున మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సంజయ్‌కుమార్‌ ఎప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ వాడు కాడని, జీవన్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ దూరం చేసుకోవడం పెద్ద తప్పిదమని తెలిపారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి, పూదరి అరుణ, నారపాక అశోక్‌, డాక్టర్‌ అనూప్‌ రావు, మ్యాదరి అశోక్‌, పిల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement