సిబిల్‌ గుబులు..! | - | Sakshi
Sakshi News home page

సిబిల్‌ గుబులు..!

Jul 13 2026 1:22 AM | Updated on Jul 13 2026 1:22 AM

స్కోర్‌ ఉంటేనే రుణమంటున్న బ్యాంకర్లు

వీధి వ్యాపారులకు అందని రుణాలు

ఆత్మ నిర్భర్‌ నిధికి ఆటంకాలు

ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులు

జగిత్యాల: మున్సిపాలిటీల్లో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వీధి వ్యాపారాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వీధివ్యాపారుల ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకాన్ని అమలు చేస్తోంది. కరోనా స మయంలో వీధి వ్యాపారులు చా లామంది రోడ్డున పడటంతో వీరికి ఇచ్చిన ఈ రుణాలతో కాస్త మెరుగుపడ్డారు. అప్పటివరకు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు తీసుకుని వడ్డీ చెల్లించలేక చాలా ఇబ్బంది పడేవారు. పథకం అందుబాటులోకి రావడం.. లోన్లు ఇవ్వడంతో మంచి అవకాశంగా మారింది. మొదటి విడత రూ.10వేలు నుంచి రూ.20 వేలు, రెండో విడతలో రూ.25 వేల వరకు రుణాలు అందించారు. ఇక్కడే వారికి ఇబ్బందికరంగా మారింది. రెండో విడతలో బ్యాంక్‌ రుణం తీసుకుందామంటున్న చిరువ్యాపారులకు సిబిల్‌ స్కోర్‌ ఉంటేనే ఇస్తామని బ్యాంక్‌ అధికారులు పేర్కొంటున్నట్లు తెలిసింది. ఫలితంగా వారికి లోన్లు అందే అవకాశం లేకుండా పోతోంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వనిధి పథకాన్ని అమలు చేస్తోంది.

సిబిల్‌ స్కోర్‌తో ఇబ్బందులు

చిరువ్యాపారాలు చేసుకునే వారికి సిబిల్‌ స్కోర్‌ చూడటం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. బ్యాంకర్లు మాత్రం అదే ప్రామాణికం అని అంటున్నట్లు సమాచారం. మొదటి విడత, రెండో విడత రుణాలు తీసుకున్న వ్యాపారులకు మూడో విడతకు వచ్చే సరికే సిబిల్‌ పూర్తిగా పడిపోయింది. మొదటి విడత అందించిన రూ.10వేల రుణాన్ని ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 13,032 మంది వీధి వ్యాపారులకు రూ.13.19 కోట్లు ఇచ్చారు. రెండో విడత 6,211 మందికి రూ.25 వేల చొప్పున రూ.12.42 కోట్లు అందించారు. మూడో విడత కింద రూ.50వేల వరకు రుణాలకు మాత్రం ఇప్పటివరకు కేవలం 2,130 మందికి రూ.10 కోట్లు మాత్రమే అందజేశారు. సిబిల్‌ స్కోరు తక్కువ ఉండడం వల్లే వీరికి రుణాలు అందలేదని అధికారులు పేర్కొంటున్నారు.

సక్రమంగా చెల్లిస్తేనే..

సిబిల్‌ స్కోర్‌ అంటే ఏవైనా రుణాలు తీసుకున్నప్పుడు సక్రమంగా చె ల్లిస్తేనే ఉంటుంది. ఒకవేళ రుణాలు తీసుకుని సకాలంలో కిస్తీలు కట్టకున్నా.. రుణా లు ఎగ్గొట్టినా పూ ర్తిగా పడిపోతుంది. దీంతో బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తారు. వీరు రుణాలు ఎత్తుకున్న ఖాతాలను పరిశీలించి సిబిల్‌ ఉందా లేదా అనేది చూసే రుణాలు మంజూరుచేస్తారు.

అవగాహన కరువు

సిబిల్‌ స్కోర్‌ అంటే చాలా మందికి తెలియదు. సకాలంలో రుణాలు చెల్లించాలని వ్యాపారులకు తెలిస్తే ఈ ఇబ్బంది తలెత్తదు. ఒకనెల కిస్తీ చెల్లించకుండా సిబిల్‌ స్కోర్‌ పడిపోతుంది. క్రమం తప్పకుండా చెల్లిస్తేనే పెరుగుతుంది. వ్యాపారులు రుణాలను ఏక మొత్తంలో చెల్లిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో రుణాలు పొందే అవకాశం కోల్పోతున్నారు.

అవగాహన కల్పిస్తేనే

మున్సిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులను గుర్తించి రుణాలు అందజేస్తారు. అధికారులు పూర్తిస్థాయిలో వీరికి అవగాహన కల్పిస్తే ఇలాంటి ఇబ్బందులు తలెత్తవు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. అధి కారులు స్పందించి వీధి వ్యాపారులకు సిబిల్‌ స్కో ర్‌తో సంబంధం లేకుండా రుణాలు అందేలా చర్యలు తీసుకోవడంతోపాటు, వీటిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

వీధి వ్యాపారులకు సిబిల్‌ వర్తించదు

వీధి వ్యాపారులకు సిబిల్‌ వర్తించదు. బ్యాంకర్లకు తెలుపుతున్నాం. కొంత మంది ఇబ్బందులు పడుతున్నది వాస్తవమే. దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు వీధివ్యాపారులకు రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటాం.– శ్రీనివాస్‌గౌడ్‌,

4మెప్మా ఏవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement