బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని పంటలకు డ్రిప్ ద్వారా అందిస్తున్న. వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న మొలకలు వడలిపోతున్నాయి. రోజు రెండుమూడు గంటలు నీటిని అందించి మొక్కలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను.
– మారు మురళీధర్ రెడ్డి, వెల్లుల్ల, మెట్‌పల్లి(మం)
నారు ఇప్పుడే పోస్తున్న
బావుల్లో ఉన్న నీటితో నారు పోస్తున్నాను. ఆగస్టు నాటికి వర్షాలు కురిస్తే నాటుకు సిద్ధం చేయవచ్చనే ఆలోచనతో మడులు దున్నిస్తున్నాను. నీరు సరిగా లేకపోవడంతో బావిలో పూడిక తీయించేందుకు ప్రయత్నం చేస్తున్నాను.
– బేతి లింగారెడ్డి, మోరపల్లి, జగిత్యాల రూరల్


