పొదుపు సంఘాల్లో ‘డిజిటల్‌’ | - | Sakshi
Sakshi News home page

పొదుపు సంఘాల్లో ‘డిజిటల్‌’

Jul 8 2026 2:08 AM | Updated on Jul 8 2026 2:08 AM

● ప్రత్యేకంగా మన సీ్త్రనిధి యాప్‌ ● మధ్యవర్తుల ప్రమేయానికి చెక్‌ ● పారదర్శకంగా లావాదేవీలు ● ఈ ఏడాది రూ.122 కోట్ల రుణ లక్ష్యం ● యాప్‌ కేవలం చెల్లింపులకే కాకుండా సంఘాల సమగ్ర నిర్వహణకు డిజిటల్‌ డైరీలా పనిచేస్తుంది ● యాప్‌లోని డీసీబీ రిపోర్ట్‌పై క్లిక్‌ చేయగానే సభ్యురాలి డిమాండ్‌, కలెక్షన్‌, బ్యాలెన్స్‌ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ● గ్రూపులోని ప్రతి సభ్యురాలి సమాచారం అందుబాటులో ఉండటం వల్ల లెక్కల్లో పొరపాట్లకు తావుండదు. ● అత్యవసర సమయాల్లో మహిళలు ఈ యాప్‌ ద్వారానే కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది.

గొల్లపల్లి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి సరికొత్త డిజిటల్‌ పునాది పడింది. సీ్త్రనిధి ప్రగతి – మన లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన సీ్త్రనిధి యాప్‌ మహిళలకు సమగ్ర సమాచారాన్ని అందిస్తూ.. వారిని డిజిటల్‌ చెల్లింపుల వైపు నడిపిస్తోంది. క్షేత్రస్థాయిలో సభ్యులు చెల్లించే నగదు పక్కదారి పట్టకుండా, వడ్డీల భారం పడకుండా ఈ యాప్‌ పూర్తి పారదర్శకతను చేకూరుస్తోంది.

నగదు దుర్వినియోగానికి చెక్‌

గతంలో సంఘం సభ్యులు తమ రుణ వాయిదా డబ్బులను గ్రూపు లీడర్లు, ఆర్పీలకు చెల్లించేవారు. కొన్ని సందర్భాల్లో ఆ సొమ్మును సకాలంలో బ్యాంకుల్లో జమ చేయకపోవడంతో రికార్డుల్లో తేడాలు వచ్చి వడ్డీ భారం పెరిగేది. దీనికి చెక్‌ పెడుతూ.. మన సీ్త్రనిధి యాప్‌ను తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా.. సభ్యురాలు చెల్లించింది ఎంత..? ఇంకా బకాయి ఎంత ఉంది..? వంటి వివరాలన్నీ యాప్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా డబ్బులు దుర్వినియోగం అయ్యే అవకాశమే ఉండదు.

భారీగా తగ్గనున్న చార్జీలు

సాధారణ యాప్‌ల ద్వారా రుణ వాయిదా చెల్లిస్తే ప్రతి లావాదేవీపై రూ.9తోపాటు రూ.3 జీఎస్టీ కలిసి మొత్తంగా రూ.12 నుంచి రూ.13 వరకు భారం పడేది. మన సీ్త్రనిధి యాప్‌ ద్వారా చెల్లిస్తే కేవలం రూ.2.36 చార్జీలే వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇది మహిళా సంఘాలకు పెద్ద ఊరటగా చెప్పవచ్చు.

ఒక్క క్లిక్‌తో..

జిల్లా లక్ష్యం రూ.122 కోట్ల రుణాలు:

ఈ ఏడాది మహిళా సంఘాల సభ్యులకు సీ్త్ర నిధి ద్వారా మొత్తంగా రూ.122 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అధికారులు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ డిజిటల్‌ విప్లవం ద్వారా మహిళా సంఘాల్లో సరికొత్త పారదర్శకత రావడమే కాకుండా, వారు ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో రుణలక్ష్యం ఇలా..

సెర్ప్‌ రూ.92 కోట్లు

మెప్మా రూ.30 కోట్లు

మొత్తం లక్ష్యం : రూ.122 కోట్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement