తండాల అభివృద్ధికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

తండాల అభివృద్ధికి ప్రాధాన్యం

Jul 8 2026 2:08 AM | Updated on Jul 8 2026 2:08 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

పెగడపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం శీత్లాభవానీ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని మద్దులపల్లి, ఏడుమోటలపల్లి, రాజరాంపల్లి తండాల్లో గిరిజనులు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. తండాలను అనుసంధానం చేస్తూ రూ.68 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. మద్దులపల్లిలో గిరిజన సంఘం భవనం కోసం రూ.25 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. గిరిజనుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సర్పంచులు శ్రీవాణీ, బలరామ్‌రెడ్డి, రమేశ్‌నాయక్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో శశికుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ సయ్యద్‌ నిజామొద్దీన్‌, మాజీ సర్పంచి ఇస్లావత్‌ రవినాయక్‌, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు జీవన్‌నాయక్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు తిరుపతి పాల్గొన్నారు.

పౌష్టికాహారం అందించాలి

బుగ్గారం: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని మంత్రి సూచించారు. మండలంలోని యశ్వంత్‌రావుపేటలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఉరుమట్ల లక్ష్మీ, మాజీ జెడ్పీటీసీ బాదినేని రాజేందర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నర్సాగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement