మహిళ మెడలోని పుస్తెలతాడు చోరీకి యత్నం | - | Sakshi
Sakshi News home page

మహిళ మెడలోని పుస్తెలతాడు చోరీకి యత్నం

Jul 8 2026 2:08 AM | Updated on Jul 8 2026 2:08 AM

వీణవంక: ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కునేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన మహిళ ప్రతిఘటించడంతో దుండగుడు పరారయ్యాడు. మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన పద్మ భర్త వైకుంఠంతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా దుండగుడు ఇంట్లోకి చొరబడి పుస్తెలతాడును లాక్కునేందుకు యత్నించగా పద్మ ప్రతిఘటించింది. ఆమె కేకలు విని కుటుంబ సభ్యులు బయటకు రావడంతో దుండగుడు సెల్‌ఫోన్‌, సైకిల్‌ వదిలేసి పారిపోయాడు. ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటన స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం ఎల్భాక గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తలరించామన్నారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.

ప్రతిఘటించిన మహిళ, పరారైన దుండగుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement