● బైక్ ధ్వంసం.. వాహనదారుడు క్షేమం
● తృటిలో తప్పిన భారీ ప్రమాదం
వేములవాడ: వేములవాడ–కోరుట్ల రహదారిపై కొనాయిపల్లి–పోచెట్టిపల్లి గ్రామాల మధ్య మంగళవారం చెట్టు విరిగి ద్విచక్రవాహన దారుడిపై పడ్డ ఘటనలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన ఎడపల్లి జయసింహారెడ్డి మంగళవారం ద్విచక్రవాహనంపై వేములవాడ–కోరుట్ల రహదారిపై వెళ్తుండగా కొనాయిపల్లి–పోచెట్టిపల్లి గ్రామాల మధ్య ఒక్కసారిగా భారీ చెట్టు విరిగి అతనిపై పడింది. ద్విచక్రవాహనం పూర్తిగా దెబ్బతినగా.. జయసింహారెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. గ్రామస్టులు చేరుకొని చెట్టు కొమ్మలను తొలగించి బైక్‌ను బయటకు తీశారు. కొద్దిసేట ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది.


