కరీంనగర్‌రూరల్: కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న బట్టి శివ(23) అనే యువకుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో వాహనాలు తనీఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కన్పించిన శివను తనీఖీ చేయగా గంజాయి లభించినట్లు వివరించారు. తీగలగుట్టపల్లిలోని సరస్వతినగర్‌కు చెందిన శివ గత కొంతకాలంగా గంజాయి, మద్యం తాగేందుకు అలవాటు పడ్డాడని, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని బల్లర్షా నుంచి సుమారు అర కిలో గంజాయి కొనుగోలు చేసి కరీంనగర్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు. కరీంనగర్, చొప్పదండి, నగునూరు తదితర ప్రాంతాల్లోని లారీడ్రైవర్లు, యువకులకు ప్యాకెట్‌ను రూ.500 చొప్పున విక్రయించి సుమారు రూ.10వేల వరకు సంపాదించినట్లు వివరించారు. మంగళవారం రైల్వేస్టేషన్ పరిసరాల్లో గంజాయి విక్రయించేందుకు వచ్చిన శివనుంచి 100గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


