చెరువుల కబ్జా ఆపండి | - | Sakshi
Sakshi News home page

చెరువుల కబ్జా ఆపండి

Jul 7 2026 12:27 AM | Updated on Jul 7 2026 12:27 AM

మాది మల్యాల మండలం తక్కళ్లపల్లి. శివారులోని చిన్న చెరువు, లక్ష్మణ్‌కుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కొందరు బావులు తవ్వుతూ.. మట్టి నింపుతూ కబ్జా చేస్తున్నారు. తహసీల్దార్‌, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. బావులకు విద్యుత్‌ శాఖ కనెక్షన్‌ కూడా ఇచ్చింది. కబ్జా నియంత్రించి చెరువులకు హద్దులు ఏర్పాటు చేయించండి.

– మత్స్యకారులు, తక్కళ్లపల్లి

రోడ్డు ఆక్రమిస్తున్నరు

దళితవాడకు రహదారి మీదుగా సుమారు 20ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్నాం. తిరుపల్లి రాజయ్య అనే వ్యక్తి దారికి అడ్డంగా పెద్ద బండ రాళ్లు పోయించిండు. ఇళ్లలోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాం. అంబులెన్స్‌, ఫైరింజన్‌ తదితర వాహనాలు వచ్చే వీలు లేకుండా పోయింది. ప్రజావాణి, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. రహదారిలో రాకపోకలకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలి.

– బట్టపల్లి మహిళలు, సారంగాపూర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement