మున్సిపల్ కార్యాలయంలో పంచాంగ శ్రవణంలో వేద పండితులు
కొండగట్టులో పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ధర్మపురిలో ఉత్సవమూర్తులకు అర్చకుల పూజలు
పంచాంగ శ్రవణంలో జీవన్‌రెడ్డి తదితరులు
జగిత్యాల/మల్యాల/జగిత్యాలటౌన్/ధర్మపురి: పరాభవం నామ సంవత్సరంలో అన్ని శుభాలే కలుగుతాయని వేద పండితులు నంబి వేణుగోపాలాచార్య అన్నారు. జగిత్యాల బల్దియా ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. చైర్‌పర్సన్ సమిండ్ల వాణి మాట్లాడుతూ పట్టణాభివృద్ధి, సంక్షేమం నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి నివాసంలో పాలెపు చంద్రశేఖర్‌శర్మ పంచాంగ శ్రవణం చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు జీవన్‌రెడ్డి ఉగాది పచ్చడి అందించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత పాల్గొని ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. విశ్వహిందూ పరిషత్ వేడుకల్లో బీజేపీ సీనియర్ నాయకులు ఏసీఎస్.రాజు, వీహెచ్‌పీ నాయకులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆకాంక్షించారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో బుగ్గారపు రాజేంద్రప్రసాద్ పంచాంగశ్రవణం చేశారు.
●
●


