2.25 లక్షల మంది.. రూ.243.32 కోట్లు | - | Sakshi
Sakshi News home page

2.25 లక్షల మంది.. రూ.243.32 కోట్లు

Mar 19 2026 7:57 AM | Updated on Mar 19 2026 7:57 AM

యాసంగి ‘రైతు భరోసా’కు గ్రీన్‌సిగ్నల్‌ ఈనెల 22నుంచి రైతుల ఖాతాల్లోకి.. తొలి విడతగా ఎకరం వరకు..

పెట్టుబడికి ఉపయోగపడుతుంది

నేరుగా రైతుల ఖాతాల్లోకి

జగిత్యాలఅగ్రికల్చర్‌: రైతు భరోసా కింద ఎకరాకు రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. తొలుత ఈనెల 22న ఎకరం ఉన్నవారికి.. తర్వాత విడతల వారీగా ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాలో 2,25,406 మంది రైతులు రైతుభరోసాకు అర్హత సాధించారు. వారి వివరాలను ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పంపించింది. ఈ లెక్కన జిల్లా రైతులకు రూ.243,32,69,106 జమ కానున్నాయి.

మూడు విడతలుగా రైతు భరోసా

గతంలో ఎకరం లోపు వారికి, తర్వాత రెండెకరాలు.. ఇలా ఎకరాల వారీగా రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి. యాసంగి సీజన్‌కుగాను మొదటి విడత ఎకరం వరకు ఈనెల 22న, 20రోజుల తర్వాత ఏప్రిల్‌ 15 వరకు రెండో విడత కింద ఐదారు ఎకరాల వరకు, మూడో విడత కింద ఐదారు ఎకరాలపైన ఉండే రైతులందరికి ఏప్రిల్‌ 30వరకు రైతుభరోసా అందే అవకాశం ఉంది. జిల్లాలో అత్యధికంగా మెట్‌పల్లి మండలంలోని 15,516 మంది రైతులకు రూ.16.71 కోట్లు రైతు భరోసా అందనుంది. అలాగే అత్యల్పంగా జగిత్యాల అర్బన్‌ మండలంలో 4,744 మంది రైతులకు రూ.2.78 కోట్లు అందనున్నాయి.

రైతుభరోసా డబ్బులు రైతులను ఆపదలో ఆదుకుంటాయి. డబ్బులు వస్తే యాసంగి ఖర్చులకు ఉపయోగపడతాయి. కూలీల, రసాయన ఎరువుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది.

– గణపతి, దొంతాపూర్‌, ధర్మపురి(మం)

అర్హుల జాబితా ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంది. ఆ మేరకు విడతల వారీగా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సీజన్‌లో 2.25 లక్షల మందికి, రూ.243 కోట్ల వరకు రైతు భరోసా అందే అవకాశం ఉంది.

– భాస్కర్‌, డీఏవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement