జగిత్యాల: విద్యార్థులు నైపుణ్యం పెంచుకుంటే అన్నిరంగాల్లో విజయం సాధించవచ్చని టీఎస్‌కేసీ కో–ఆర్డినేటర్ నీరజ అన్నారు. బుధవారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో నాంది ఫౌండేషన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో మూడురోజులు శిక్షణ కల్పించారు. విద్యార్థులకు సంఖ్య వాచక సంబంధాలు, రక్త సంబంధాలు, దిశలపై శిక్షణ కల్పించారు. విశ్లేషనాత్మక నైపుణ్యాలు పెరిగి విద్యార్థులు పోటీ పరీక్షల్లో వచ్చే పరీక్షలకు సులభంగా జవాబు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ప్రమోద్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ చంద్రయ్య, సంగీత, సాగర్, పాల్గొన్నారు.


