కరీంనగర్‌క్రైం/జగిత్యాలక్రైం: అవినీతి కేసులో ఎకై ్సజ్ సీఐతో పాటు సహకరించిన ఉపాధ్యాయుడిని ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో మామూళ్లు తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా దర్యాప్తు చేశారు. రాము ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.20 లక్షలు లభ్యమైంది. ఈ విషయంపై ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు.
ఎకై ్సజ్ సీఐ ఇంట్లో సోదాలు
ఏసీబీ అధికారులకు పట్టుబడిన కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ రాములుకు చెందిన జగిత్యాలలోని భవానీనగర్‌లోని ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. రాములుది జగిత్యాల జిల్లా భీమారం మండలకేంద్రం. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బినామీ పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.


