ఉపాధి కూలీలను పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలను పెంచాలి

Mar 19 2026 7:57 AM | Updated on Mar 19 2026 7:57 AM

అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌

జగిత్యాల: ఉపాధి హామీ పథకంలో కూలీలను పెంచాలని అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ అన్నారు. బుధవారం ఎంపీడీవోలు, అసిస్టెంట్‌ ఇంజినీర్లు, పంచాయతీరాజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, సీసీరోడ్లు, పశువుల పాకలు, కోళ్ల పాకలు మొదలైన పనులను త్వరితగతిన పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో రఘువరణ్‌, ఏఈ లక్ష్మణ్‌రావు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement