మైనార్టీల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

మైనార్టీల సంక్షేమానికి కృషి

Mar 20 2026 8:10 AM | Updated on Mar 20 2026 8:10 AM

ధర్మపురి: ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. రంజాన్‌ మాసం సందర్భంగా స్థానిక ఎస్‌హెచ్‌ గార్డెన్‌లో ముస్లింలకు తోఫాలు పంపిణీ చేశారు. గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి, పుష్కరాల వరకు ధర్మపురిలో బస్‌ డిపో ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. అడిషనల్‌ కలెక్టర్‌ రాజాగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేముల నాగలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ రామన్న, ఏఎంసీ చైర్‌ పర్సన్‌ చిలుముల లావణ్య, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ముస్లిం కమిటీ సభ్యులు తదితరులున్నారు.

ఆ గ్రామంలో మొదటిసారి పంచాంగ శ్రవణం

రాయికల్‌: మండలంలోని మారుమూల గిరి జన గ్రామం జగన్నాథపూర్‌ 25 ఏళ్ల క్రితం పంచాయతీగా ఏర్పడింది. ఉగాదికి పంచాంగ శ్రవణమే తెలియదు. మొదటిసారి సర్పంచ్‌ పరంచ శంకర్‌ గ్రామంలో ఉగాది వేడుకలతోపాటు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన అర్చకులు రమేశ్‌ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేయించారు. నాయకులు పటేల్‌ సుధాకర్‌, సిడెం భీం పాల్గొన్నారు.

ఇంటర్‌ మూడో మూల్యాంకనం ప్రారంభం

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ (ప్రభుత్వ) జూనియర్‌ కళాశాలలో శుక్రవా రం నుంచి మూడో విడత మూల్యాంకనం ప్రారంభమవుతుందని నోడల్‌ అధికారి నారా యణ తెలిపారు. అధ్యాపకులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement