20న ధర్మపురికి డిప్యూటీ సీఎం
● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
బుగ్గారం(ధర్మపురి): డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈనెల 20న ధర్మపురికి రానున్నారు. సంక్షేమశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ శనివారం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రూ.200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల, గోదావరిలో మురుగునీరు కలవకుండా సివరేజ్ ప్లాంట్, నూతన విద్యుత్ లైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.


