ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఐదు మున్సిపాలిటీల రిజర్వేషన్లు ప్రకటించామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్లను డ్రా పద్ధతిలో ఖరారు చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా.. ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించామన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా రాజ కీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. రిజర్వేషన్ల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు.


