హ్యాపీ న్యూఇయర్
జగిత్యాలక్రైం: కొత్త సంవత్సరం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ కేక్ కట్ చేశారు. ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌శాఖలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టామని, సిబ్బంది పూర్తిస్థాయి నిబద్ధతతో విధులు నిర్వర్తించారని తెలిపారు. జిల్లాలో న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ తెలిపారు.డ్రంకెన్‌డ్రైవ్‌లో మొత్తం 138మందిని పట్టుకున్నట్లు వివరించారు. అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు కరుణాకర్, నీలం రవి, రాంనర్సింహారెడ్డి, సుధాకర్, ప్రవీణ్, ఆరీఫ్ అలీఖాన్, ఎస్సైలు పాల్గొన్నారు.
జగిత్యాల: ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లా అధికారులందరూ అదే ఉత్సాహంతో పనిచేసి 2026లో కూడా మంచి పేరు తీసుకురావాలన్నారు. అందరూ యోగా, వ్యాయామం చేయాలని, ఉదయం నడవాలని, ప్రతిరోజు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందరికీ శుభం కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.
హ్యాపీ న్యూఇయర్


