ట్రాఫిక్ నియమాలు పాటించాలి
జగిత్యాల: ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టరేట్‌లో గురువారం ఆవిష్కరించారు. ప్రయాణీకులు భద్రత పాటించాలన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారించడంలో అవగాహన, క్రమశిక్షణ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్ పాల్గొన్నారు.
అంజన్న సన్నిధిలో మంత్రి అడ్లూరి, విప్ ఆది పూజలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వారికి స్వామివారి తీర్థ, ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.
అథ్లెటిక్స్ పోటీలకు భూషణరావుపేట విద్యార్థి
కథలాపూర్: మండలంలో ని భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థి అభినందన్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు పీడీ నవీన్‌కుమార్ తెలిపారు. ఇటీవల మండలంలోని ఊట్‌పెల్లిలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అభినందన్ రెండోస్థానం దక్కించుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగే పోటీల్లో రన్నింగ్ విభాగంలో జిల్లా జట్టు తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు. అభినందన్‌ను సర్పంచ్ బద్దం మహేందర్‌రెడ్డి, హెచ్‌ఎం రాజయ్య అభినందించారు.
సుఖశాంతులతో జీవించాలి
మల్లాపూర్: కొత్త సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నిండాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు చిట్యాల లక్ష్మణ్, తోట శ్రీనివాస్, రైతుబంధు జిల్లా కమిటీ మాజీ సభ్యుడు దేవ మల్లయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ముద్దం శరత్‌గౌడ్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామిగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నియమాలు పాటించాలి
ట్రాఫిక్ నియమాలు పాటించాలి
ట్రాఫిక్ నియమాలు పాటించాలి


