అభ్యంతరాలు స్వీకరణ
జగిత్యాల/కోరుట్ల/మెట్‌పల్లిరూరల్/ధర్మపురి/రాయికల్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఓట ర్ ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. వార్డుల వారీగా ఓటర్ల లెక్కను సరిచేశారు. ఓటర్ల ఆధారంగా పోలింగ్ కేంద్రాలను మ్యాపింగ్ చేయడంతో కొన్ని బల్దియాల్లో పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. జగిత్యాలలో 149, కోరుట్లలో 94, మెట్‌పల్లిలో 64 కేంద్రాలుగా గుర్తించారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదాను కలెక్టరేట్, ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. మూడురోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించి.. 5, 6 తేదీల్లో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి.. ఈనెల 10న తుది జాబితాను ప్రకటించనున్నారు. నిబంధనల ప్రకారం 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున గుర్తించారు. 800కు మించి ఓటర్లు ఉండకూడదు. ఒకవేళ ఒక పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా ఓటర్లు ఉంటే మూడో కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు. ఒకే కుటుంబంలో ఉండే ఓటర్లు ఒకే వార్డు, ఒకే పోలింగ్ కేంద్రం అన్న నిబంధన అమలు చేస్తున్నా రు. ఓటరు పేరు, ఇతరత్రా తప్పొప్పులు, చిరునా మాలో మార్పులుంటే మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరించి, పరిశీలించి వెంటనే పరిష్కరిస్తారు. జాబితా విడుదల కార్యక్రమంలో మెట్‌పల్లిలో మున్సిపల్ కమిషనర్ మోహన్, మేనేజర్ వెంకటలక్ష్మీ, డిప్యూటీ ఈఈ నాగేశ్వర్‌రావు, టీపీవో రాజేంద్రప్రసాద్, ధర్మపురిలో మున్సిపల్ మేనేజర్ బాలె గంగాధర్, శానిటరీ ఇన్స్‌పెక్టర్ గంగాధర్, మెప్మా సిబ్బంది, కోరుట్లలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, అధికారులు పాల్గొన్నారు.
వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల
పెరిగిన పోలింగ్ కేంద్రాలు
5, 6తేదీల్లో రాజకీయ పార్టీలతో సమావేశం
బల్దియా వార్డులు ఓటర్లు పోలింగ్ కేంద్రాలు
ధర్మపురి 15 14,222 24
జగిత్యాల 50 96,410 149
రాయికల్ 12 13,195 24
కోరుట్ల 33 63,741 94
మెట్‌పల్లి 26 46,371 64


