న్యూ ఇయర్ కిక్కు
జగిత్యాలక్రైం: జిల్లాలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యంప్రియులు తెగ తాగేశారు. జిల్లాలోని 71 వైన్స్‌షాపులు, 21 బార్లలో డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.8.07 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ నెల మొత్తంగా రూ.112,53,37,463 మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ మొత్తం రూ.73,38,63,772 అమ్మకాలు జరిగాయి. ఈసారి రూ.39,14,73,691 అమ్మకాలు పెరిగాయి. పోలీసు శాఖ మూడు రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. మద్యంప్రియులు అవేం పట్టించుకోకుండా భారీగా మద్యం కొనుగోలు చేసి వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు.
138 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు
కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు ప్రత్యేక బృందాలతో జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం వేకువజాము 5 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో 138 మందిని మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.
మద్యం షాపులకు కలిసివచ్చిన డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.8.07కోట్ల మద్యంఅమ్మకాలు
ఈ సారి మద్యం అమ్మకాలు పెరిగాయి
డిసెంబర్ మొత్తంగా రూ.112.53 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది గతంలో కంటే రూ.39.14 కోట్ల అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ 31నే రూ.8.07 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
– సర్వేశ్, ఎకై ్సజ్ సీఐ, జగిత్యాల


