‘టెట్’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
న్యూస్‌రీల్
● 160 మంది అభ్యర్థులు ● అదనపు కలెక్టర్ లత
జగిత్యాల: ‘టెట్’ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. నాచుపల్లి జేఎన్‌టీయూలో ఈనెల 4న నిర్వహించే పరీక్షకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మొత్తం 160 మంది అభ్యర్థులకు కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ఉదయం 9 గంటల నుంచి 11.30, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు పరీక్ష ఉంటుందని, పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తుతోపాటు, 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. కంప్యూటర్స్, జనరేటర్, ఇతర వసతులు కల్పించాలన్నారు. డీఈవో రాము, డీఎం కల్పన, డీఎంహెచ్‌వో సుజాత, జేఎన్‌టీయూ చీఫ్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.
రోళ్లవాగు నుంచి సాగునీరు అందేలా కృషి
జగిత్యాలరూరల్: రోళ్లవాగు నుంచి ఆయకట్టుకు సాగునీరు అందేలా కృషిచేస్తానని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బీర్‌పూర్ మండలంలోని రోళ్లవాగు ఆరుగుండాల ప్రాజెక్ట్‌ను రైతులతో కలిసి బుధవారం పరిశీలించారు. రోళ్లవాగు అభివృద్ధి, ఆరుగుండాల ప్రాజెక్ట్ పనులకు నిధులు మంజూరయ్యేలా చూడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ఫోన్లో కోరారు. ఆరుగుండాల ప్రాజెక్ట్‌కు రోళ్లవాగు నుంచే నీరు రావాల్సి ఉందని, వాగుపై ఆధారపడిన రైతులు సుమారు 100కు పైగా మోటార్లు పెట్టుకోవడం ద్వారా నీరు చివరి ఆయకట్టుకు చేరడం ఇబ్బందిగా ఉందన్నారు. వారం రోజులుగా విడుదలవుతున్న నీరు సరిపోవడం లేదని, ఆరుగుండాల ప్రాజెక్ట్‌లో నీరు చేరాలంటే మరో రెండు రోజులు విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
‘టెట్’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి


