కొత్త సంవత్సరంలో శుభాలు కలగాలి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యం, సుఖశాంతులు, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించా రు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు లో ప్రజల సహకారం కొనసాగాలని, జిల్లా అన్ని రంగాల్లో ముందుకు నడిపేందుకు అధి కారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
యావర్‌రోడ్ విస్తరిస్తాం
జగిత్యాల: కొత్త సంవత్సరంలో యావర్‌రోడ్ విస్తరించేలా కృషి చేస్తానని, జిల్లాకేంద్రంలో మరో 230 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక తీసుకుంటానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడారు. ముందుగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏళ్లుగా సమస్య అయిన యావర్‌రోడ్‌ను ఈ సంవత్సరంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని, మెడికల్ కళాశాలకు అనుబంధంగా మరో 230 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసేలా చూస్తానని వెల్లడించారు. కేంద్రీయ విద్యాలయం, ఇంటిగ్రేటెడ్ స్కూల్, మినీస్టేడియం పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఇటీవల సీఎం చొరవతో జగిత్యాల బల్దియాకు మంజూరైన రూ.62 కోట్లతో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లా కేంద్రంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీతోపాటు, ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ కాలనీలో వసతులు ఏర్పాటు చేస్తానన్నారు.
కొత్త సంవత్సరంలో శుభాలు కలగాలి


