ముందుగా సర్పంచ్‌గా పోటీచేద్దాం.. | - | Sakshi
Sakshi News home page

ముందుగా సర్పంచ్‌గా పోటీచేద్దాం..

Nov 23 2025 6:07 AM | Updated on Nov 23 2025 6:07 AM

ముందు

ముందుగా సర్పంచ్‌గా పోటీచేద్దాం..

● అవసరమైతే నేనే జైలుకు వెళ్తా.. ● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

రాయికల్‌: స్థానిక సంస్థల ప్రక్రియలో భాగంగా మొదట సర్పంచ్‌ రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఇటీవల సర్పంచ్‌, ఎంపీపీ, జెడ్పీటీసీల రిజ ర్వేషన్లను ఒకేసారి ప్రకటించి ప్రభుత్వం జాబితాను విడుదల చేసినప్పటికీ కోర్టు ఆంక్షలతో అది రద్దయిన విషయం తెల్సిందే. అప్పటినుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచ్‌ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆశావహులంతా ముందుగా సర్పంచ్‌గా పోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు.

కలిసివస్తే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా..

సర్పంచుల రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ గ్రామాల రిజర్వేషన్లు దాదాపుగా పాతవే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రిజర్వేషన్లు మారడంతో మొదటగా సర్పంచ్‌గా ఎన్నికై న తర్వాత ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే అప్పుడు చూద్దామంటూ ఇప్పుడు మాత్రం సర్పంచ్‌ ఎన్నికల వైపే మొగ్గుచూపుతున్నారు. రిజర్వేషన్లు కలిసివస్తే కుటుంబంలోని ఆశావహుల్లో ఒకరు సర్పంచ్‌, మరొకరు ఎంపీటీసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా అదృష్టం కలిసి వస్తే ఎంపీపీగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

యాదవుల కోసం ఉద్యమిస్తాం

గొల్లపల్లి:జనాభా ప్రకారం యాదవులకు హక్కుల కోసం ఉద్యమిస్తామని సంఘం జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేశ్‌ అన్నారు. మండలంలోని బీబీరాజ్‌పల్లిలో సభ్యత్వ నమోదు చేపట్టారు. సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. సమస్యల పరిష్కారం, న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధనకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య కార్యవర్గ సభ్యులు మ్యాదరవేని రామాంజనేయులు యాదవ్‌, మధుయాదవ్‌, బుచ్చిరాములు, నరేందర్‌, బీబీరాజ్‌పల్లి సంఘం నాయకులు కొమురయ్య, రాజయ్య, చిన్న నర్సయ్య, శ్రీనివాస్‌, రాజయ్య, లింగయ్య, రాజయ్య, మల్లేశ్‌ పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులడిగితే రోకలితో కొట్టండి

మెట్‌పల్లిరూరల్‌/ఇబ్రహీంపట్నం/మల్లాపూర్‌: ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డుల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే రోకలిబండతో కొట్టాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదా రులకు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ప్రొసీడింగ్‌ పత్రాలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డుల మంజూరుకు కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన పనిలేదని, ఎవడైనా అడిగితే రోకలిబండతో తలపగులగొట్టి తన పేరు చెప్పాలని, అవసరమైతే తానే జైలుకు వెళ్తానని తెలి పారు. మెట్‌పల్లిలో ఎంపీడీవో సురేశ్‌, పంచాయతీ కార్యదర్శులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో మాజీ కో–ఆప్షన్‌ ఏలేటి చిన్నారెడ్డి, నేమూరి సత్యనారాయణ, జాజాల జగన్‌రావు, గుంటి దేవయ్య, సున్నం సత్యం పాల్గొన్నారు. మల్లాపూర్‌లో ప్యాక్స్‌ చైర్మన్లు వేంపేట నర్సారెడ్డి, బద్దం అంజిరెడ్డి, నేరళ్ల మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

కథలాపూర్‌: పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని తాండ్య్రాలలో వివిధ గ్రామాలకు చెందిన 40 మందికి కల్యాణలక్ష్మి, 52 మందికి సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులు అందించారు. గంభీర్‌పూర్‌ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సూరమ్మ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ పనుల్లో భూములు కోల్పోయే రైతులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, తహసీల్దార్‌ వినో ద్‌, కాంగ్రెస్‌ నాయకులు కాయితి నాగరాజు, తొట్ల అంజయ్య, హరిప్రసాద్‌, జవ్వాజి చౌదరి, గడ్డం చిన్నారెడ్డి, జంగ రంజిత్‌, కూన అశోక్‌ పాల్గొన్నారు.

ముందుగా సర్పంచ్‌గా పోటీచేద్దాం..
1
1/1

ముందుగా సర్పంచ్‌గా పోటీచేద్దాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement