
తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ధర్మపురి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతి పెరిగిందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురి వద్ద గోదావరి ఉధృతిని కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. తీరప్రాంత ప్రజలకు ఇ బ్బంది కలగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విలువైన సామగ్రిని మరోచో టికి తీసుకెళ్లేలా చూడాలని తెలిపారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆర్డీవో మధుసూదన్, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.