
అధికారులు అందుబాటులో ఉండాలి
ఇబ్రహీంపట్నం/మల్లాపూర్: గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి వద్ద, మల్లాపూర్ మండలం వాల్గొండ వద్ద గోదావరి ఉధృతి, యామాపూర్, ఫకీర్‌కొండాపూర్‌లో కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డును పరిశీలించారు. లోలెవల్ వంతెనల స్థానంలో హైలెవల్ వంతెనల నిర్మాణాలకు గత ప్రభుత్వంలో విద్యాసాగర్‌రావు నిధులు మంజూరు చేయించారని, కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. డీపీవో మధుసూదన్, తహసీల్దార్లు వరప్రసాద్, రమేశ్, ఎంపీడీవో శశికుమార్‌రెడ్డి, మల్లాపూర్ మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, మల్లాపూర్ బీఆర్‌ఎస్ నాయకులు కాటిపెల్లి ఆదిరెడ్డి, క్యాతం నరేశ్‌రెడ్డి, ఏలేటి మహేశ్‌రెడ్డి, సుతారి రాజేందర్, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు చిన్నారెడ్డి పాల్గొన్నారు.