
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
జగిత్యాల: స్కానింగ్ సెంటర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్ అన్నారు. గురువారం తన కార్యాలయంలో అడ్వైయిజరీ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. ప్రతినెలా ఫాం ఎఫ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో పొందుపర్చడం, ఐదో తేదీలోపు వారికి కేటాయించిన పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమర్పించాలని పేర్కొన్నారు. గర్భిణుల ఇళ్లకు వెళ్ల కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆశాకార్యకర్తలకు సూచించారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, డాక్టర్ అర్చన, సీనియర్ గైనకాలజిస్ట్ కనకదుర్గ ఉన్నారు.
బయోమెట్రిక్ అటెండెన్స్ రద్దు చేయండి
ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలకు ఆధార్‌బెస్ట్ బయోమెట్రిక్ అటెండెన్స్ రద్దు చేయాలని డీఎంహెచ్‌వోకు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు వినతిపత్రం అందించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారికి బయోమెట్రిక్ అటెండెన్స్ పెడితే చాలా ఇబ్బందులు ఎదురువతాయని పేర్కొన్నా రు. చైర్మన్ రాజేశం, రామ్మోహన్, ధనుంజయ్, మధురిమ, రాజశేఖర్, సాగర్‌రావు పాల్గొన్నారు.